రాజకీయాల్లోకి మాధురీ దీక్షిత్.. క్లారిటీ ఇచ్చిన నటి..

30 December 2023

TV9 Telugu

తన అందం, చక్కటి నటన, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న భామ మాధురీ దీక్షిత్.

1984లో కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాల్లో కథానాయకిగా మెప్పించింది. అప్పట్లో ఈమెకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్.

ఇదిలా ఉంటే ఈ నటి రాజకీయాల్లోకి రానున్నట్లు గత నెలలో న్యూస్ హెడ్‌లైన్స్ వచ్చాయి. దీనిపై కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వంటి ప్రధాన బీజేపీ నేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతోందని నార్త్-వెస్ట్ ముంబై నుంచి పోటీ చేస్తారని కూడా నివేదికలు సూచించాయి.

ఇటీవల మాధురీ దీక్షిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వాదనలను తోసిపుచ్చింది.

“లేదు, అస్సలు కాదు, నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నాపై ఇలాంటి పుకార్లు వస్తుంటాయి.

నటి ఈ పుకార్లకు స్వస్తి పలకగా, ఆమె భర్త డాక్టర్ రాజకీయాల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

“మేము అందరికీ మద్దతు ఇస్తున్నాము, మేము నిష్పక్షపాతంగా ఉన్నాము. ఎవరైనా మంచి పని చేస్తే ఆదరించాలి” అన్నారు.