30 May 2024
సౌత్ స్టార్ హీరోతో ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన ప్రియాంక చోప్రా..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తర్వాత సినిమాల్లోకి నటిగా అరంగేట్రం చేసింది.
అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తల్లి మధు చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రియాంకకు ముందుగా సౌత్ ఆఫర్ వచ్చిందని తెలిపింది.
సౌత్ స్టార్ హీరో సినిమాలో ప్రియాంకకు ఆఫర్ వచ్చిందని.. ఈ విషయం తనకు చెబితే ఏడ్చేసిందని.. సినిమాలు చేయనని కన్నీళ్లు పెట్టికుందని తెలిపింది.
వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని చెబితే తమిళ్ సినిమాకు సైన్ చేసిందని.. షూటింగ్ చేస్తున్నప్పుడే తనకు మెల్లగా నటనపై ఆసక్తి వచ్చిందని తెలిపింది.
భాష రాకపోయినా షూటింగ్ ఎంజాయ్ చేసిందని.. మూవీటీం తనకు బాగా చూసుకుందని తెలిపింది. విజయ్ దళపతి ఓ జెంటిల్మెన్ అని చెప్పుకొచ్చింది.
మొదట్లో ప్రియాంకకు పెద్దగా డాన్స్ రాదని.. అప్పుడు విజయ్ దళపతితో స్టెప్పులేసేందుకు చాలా కష్టపడిందని సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసిందట.
పని ఇష్టంగా నేర్చుకుందని.. ఆ వాతావరణం నచ్చడంతో సినిమాను కెరీర్‌గా ఎంచుకుందని అన్నారు. తమిళ్ తర్వాత బీటౌన్‌లో సెటిల్ అయ్యింది ప్రియాంక.
ఇక్కడ క్లిక్ చేయండి.