డైరెక్షన్ తప్ప మరోటి చేయని రాజమౌళి.. ఇండియన్ సినిమాపై ఉన్న మక్కువతో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను సమర్పకుడిగా ఉన్నారు.
'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకుడు. వరుణ్ గుప్తాతో పాటు కార్తికేయ దీన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది.
అయితే ఉన్నట్లుండి దీనిపై వివాదం రేగుతుందిప్పుడు. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ ఈ మధ్యే ట్వీట్ చేసారు రాజమౌళి.
అసలు మన సినిమా ఎక్కడ పుట్టింది.. ఎలా పుట్టింది అనే నేపథ్యంలో ఈ చిత్రం రానుంది.ఈ సినిమా పేరు మేడ్ ఇన్ ఇండియా కాదు.. మేడ్ ఇన్ భారత్‌గా మార్చాలంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది.
కొన్ని రోజులుగా దేశం పేరును భారత్‌గా మారుస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో చిత్రం పేరు మార్చాలని డిమాండ్ జరుగుతుంది.
మేడ్ ఇన్ ఇండియా బదులు మేడ్ ఇన్ భారత్ పెడితే బాగుంటుంది.. అలా ఆలోచించాలంటూ చిత్రయూనిట్‌కు ట్వీట్స్ రూపంలో అభిప్రాయాలు చెప్తున్నారు నెటిజన్లు.
వీటిని మేకర్స్ పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే త్వరలోనే మహేష్‌తో సినిమాను మొదలు పెట్టనున్నారు రాజమౌళి.
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.