మ్యాడ్ ట్రైలర్ ను మెచ్చుకున్న తారక్.. యాడ్ షూట్ లో చరణ్..

04 October 2023

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా మ్యాడ్.

అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని కళ్లాజోడు కాలేజ్ పాప అని సాగే వీడియో సాంగ్ విడుదల చేసారు మేకర్స్.

తాజాగా మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. ట్రైలర్ బాగుందని మెచ్చుకున్నారు.

ఈ ట్రైలర్ కామెడీగా ప్రేక్షకులను అలరించేలా ఉంది. ఇందులో దర్శకుడు అనుదీప్ కేవీ తన కామెడీతో ఆకట్టుకున్నారు.

గేమ్ ఛేంజర్ షూటింగ్‌కు బ్రేక్ రావడంతో.. ఈ గ్యాప్‌లో యాడ్ చేస్తున్నారు చరణ్. ఈయన ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న వీడియో వైరల్ అవుతుందిప్పుడు.

అందులో అయ్యప్ప మాలలో ఉన్నారు చరణ్. అక్టోబర్ 4 ఉదయం ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌లో మాల తీసేయనున్నారు రామ్ చరణ్.

దిలా ఉంటె గేమ్ ఛేంజర్ చిత్రీకరణ ఎప్పుడు క్లారిటీ లేదు. దీంతో చెప్పిన సమయానికి వస్తుందో రాదో అని ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తైన తర్వాతే గేమ్ ఛేంజర్ పై ఫోకస్ పెట్టనున్నారు.