మ్యాడ్ మూవీకి సీక్వెల్.? ప్రేమలు డిజిటల్ డేట్..

TV9 Telugu

02 April 2024

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం మ్యాడ్. గోపికా ఉద్యాన్, అననతిక ​​సనీల్‌కుమార్‌, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్లు.

కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దింతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇండస్ట్రీలో సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే కోవలో గతేడాది విడుదలైన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

మ్యాడ్ సీక్వెల్‌కు మ్యాడ్ మ్యాక్స్ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

అందమైన ప్రేమ కథతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించింది బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమలు.

మలయాళంలో విడుదలై విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో కూడా ఆకట్టుకుంది.

ఇక్కడా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా ఓటిటిలో ఎప్రిల్ 12 నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తుంది.

నస్లెన్ కె. గఫూర్ మమితా బైజు ఇందులో జంటగా నటించారు. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.