30 November 2023

ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిమేర 2 డేట్..!

ఓ సినిమా థియేటర్లో సూపర్ డూపర్ హిట్టైయితే.. ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే అందరూ ఆరా తీస్తుంటారు.

తాజాగా పొలిమేర 2 విషయంలోనూ అదే చేస్తున్నారు.

ఈక్రమంలోనే ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియడంతో ఎక్సైటెడ్‌గా ఫీలవుతున్నారు. 

పొలిమేర సినిమాకు సీక్వెల్‌గా.. అనిల్ విశ్వనాథ్‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ పొలిమేర2.

సూపర్ డూపర్ హిట్టు అయిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీకి రెడీ అయిపోయింది.

డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ లో  డిసెంబర్ 8 నుంచి పొలిమేర 2ను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతోంది.

అందర్నీ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.