చందమామ లవ్లీ పెర్ఫార్మెన్స్ ఇవే..

TV9 Telugu

03 July 2024

కాజల్ అగర్వాల్ తొలి తెలుగు సినిమా చందమామలో కూడా మహాలక్ష్మి పాత్రకు ప్రాణం పోసింది. దీంతో వరుస అవకాశాలు ఉందుకుంది.

కాజల్ అగర్వాల్ లవ్లీ పెర్ఫార్మెన్స్ అనగానే మొదట గుర్తు వచ్చేది మగధీర. ఇందులో మిత్రవింద, ఇందు అనే రెండు పాత్రల్లో ఆకట్టుకుంది.

తర్వాత చెప్పుకోదగ్గ సినిమా డార్లింగ్. ప్రభాస్ సరసన కథానాయకిగా నందినిగా క్యూట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా ఈ జాబితాలో ఉంది. ఇందులో జోగేంద్రగా రానా, రాధాగా కాజల్ జోడి అదిరింది.

ఎన్టీఆర్ బృందావనం మూవీలో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. భూమి అనే పాత్రలో లంగాఓణీతో మెప్పించింది.

మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో మరోసారి ప్రభాస్ కి జోడిగా కనిపించింది. ఇందులో ప్రియా పాత్రలో లవ్లీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన సీత ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ.. సీత పాత్రలో తనదైన నటనతో మెప్పించింది.

అల్లు అర్జున్ ఆర్య 2 మూవీలో కూడా మెప్పించింది. గీతగా తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది హీరోయిన్ కాజల్.