లవ్ మౌళి ట్రైలర్.. రష్యాలో గోట్..
TV9 Telugu
10 April 2024
టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో నవదీప్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా లవ్ మౌళి.
సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు అవనీంద్ర దర్శకుడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఓఫ్ అల్ టైం (GOAT).
ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కోలీవుడ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
తాజాగా రష్యాలో ఈ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది చిత్రయూనిట్.
ఈ షెడ్యూల్‌లో విజయ్‌తో పాటు ప్రశాంత్, ప్రభుదేవా కూడా పాల్గొంటున్నారు. క్లైమాక్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి