లవ్ మీ నుంచి సాంగ్..
TV9 Telugu
14 April 2024
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా లవ్‌మీ. అరుణ్ భీమవరపు ఈ సినిమానికి దర్శకత్వం వహిస్తోస్తున్నారు.
దిల్ రాజు ప్రొడ్యూషన్స్ సంస్థలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దయ్యాన్ని ప్రేమించే ఓ అబ్బాయి నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇటీవల విడుదలైన రావాలి రా అనే ఓ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ వేదికగా మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేసారు మూవీ మేకర్స్.
లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా నుంచి ఆటగదరా శివ లిరికల్ వీడియో విడుదల చేశారు సక్సెస్‌ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి.
చూసేది మేమైనా చూపేది నువ్వే. చేసేది మేమైనా రాసేది నువ్వే అంటూ సాగుతుంది ఈ పాట. యూట్యూబ్ లో విడుదల చేసారు.
ఈ లవ్ డ్రామా చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి