లెంగ్త్ ఎక్కువైనా సరే.. దుమ్మురేపిన పెద్ద సినిమాలు ఇవే

TV9 Telugu

28 May 2024

1977లో వచ్చిన హిందూ పౌరాణిక చిత్రం 'దాన వీర శూర కర్ణ' 3.46 గంటల నిడివితో టాలీవుడ్ లో అతి ఎక్కువ సమయం ఉన్న సినిమా.

సి.ఎస్.రావు మరియు అతని తండ్రి సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన హిందూ పౌరాణిక చలనచిత్రం లవకుశ 3.28 గంటలు ఉంది.

1965లో ఎన్టీ రామారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన పాండవ వనవాసం 3 గంటల 18 నిమిషాలు నిడివితో ఉంది.

పాతాళ భైరవి అనేది KV రెడ్డి దర్శకత్వం వహించిన భారతీయ ఫాంటసీ చిత్రం. ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 3:15 గంటలుగా ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన అల్లూరి సీతారామరాజు సినిమా 3:07 గంటలు నిడివి ఉంది.

హిందూ ఎపిక్ పౌరాణిక చిత్రంగా తెరకెక్కిన మాయబజర్. 3:04 గంటల నిడివి ఉన్న ఈ సినిమా అప్పట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

తర్వాత పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా 'RRR'. రాజమౌళి తెరకెక్కించిన ఈ 3:02 గంటలు ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి ఉన్న సినిమా రాలేదు.

RRRతో సమానంగా 3:02 లెంత్ ఉన్న మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం.