స్పీడ్ కి బ్రేకులు లేవమ్మా.. దూసుకుపోవడమే..
02 October 2023
లోకేష్ కనకరాజ్.. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. తమిళంలో సినిమాలు చేస్తున్నా.. ఆయన కంటెంట్ ఇండియా మొత్తం మాట్లాడుతుంది.
అందుకే హాట్ టాపిక్ అవుతున్నారీయన. తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న లియో అక్టోబర్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఎంత పెద్ద హీరోతో అయినా.. ఆర్నెళ్లలో ఔట్ పుట్ ఇచ్చేస్తున్నారు లోకేష్. విక్రమ్ మత్తు ఇంకా దిగకముందే లియోను దించుతున్నారు.
గ్యాప్ అనేది లేకుండా వర్క్ చేస్తున్నారు లోకేష్. సాధారణంగా స్టార్ డైరెక్టర్స్ ఓ సినిమా పూర్తయ్యాక.. కనీసం ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుంటారు.
కానీ లోకేష్ అలా కాదు.. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ లైనప్‌తో పాటు షెడ్యూల్స్ కూడా రెడీ చేస్తారు.
లియో తర్వాత రజినీకాంత్‌తో సినిమా అనౌన్స్ చేసారు లోకేష్. దాంతో పాటు ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ కూడా ప్రకటించారు ఈ దర్శకుడు.
ఇవన్నీ లైన్‌లో ఉండగానే టాలీవుడ్‌పై ఫోకస్ చేసారు లోకేష్ కనకరాజ్. ప్రభాస్‌తో పాటు రామ్ చరణ్‌తోనూ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారీయన.
ఇవన్నీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే రానున్నాయి. అలాగే బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి