ఆ ఫార్ములాను బ్రేక్ చేసేందుకు సిద్ధం అంటున్న మీడియం రేంజ్‌ హీరోలు..

13 October 2023

దసరా సినిమాతో నాని రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు మీడియం రేంజ్ సెగ్మెంట్‌లోనే ఉన్న నేచురల్‌ స్టార్‌, దసరా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటంతో నెక్ట్స్ లెవల్‌కి చేరారు.

అయితే నాని మాత్రం హరి బరిగా లెక్కలు పెంచేయకుండా... దసరా తరువాత హాయ్ నాన్న లాంటి మీడియం రేంజ్‌ మూవీతోనే ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.

సక్సెస్ విషయం పక్కన పెడితే రౌడీ బాయ్‌ సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ పక్కా అన్నట్టుగా మారింది సిచ్యుయేషన్‌.

లైగర్ సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ, అనుకున్న రేంజ్‌ సక్సెస్ సాధించలేకపోయారు.

లైగర్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విజయ్‌ రీసెంట్‌గా ఖుషీతో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్‌ను పలకరించారు.

ఈ సినిమాకు కూడా డీసెంట్‌ కలెక్షన్స్ రావటంతో విజయ్ దేవరకొండతో సినిమా అంటే భారీ బడ్జెట్‌ పెట్టేందుకు రెడీ అంటున్నారు మేకర్స్‌.

తాజాగా వరుణ్ తేజ్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా యాక్షన్‌ సినిమాలు చేస్తున్న మెగా ప్రిన్స్‌, నెక్ట్స్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఆపరేషన్‌ వాలెంటైన్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

ఆల్రెడీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. దీంతో వరుణ్‌ నెక్ట్స్ మూవీస్‌ బడ్జెట్‌ కూడా అదే రేంజ్‌లో పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్‌.