30 October 2023
లియో ఎల్‌సీయూ విమర్శలకు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన టెక్నీషియన్.
లియో సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
అయితే ఈ సినిమా విషయంలో కంప్లయింట్స్ కూడా గట్టిగానే వినిపించాయి.
ముఖ్యంగా లియోను బలవంతంగా ఎల్‌సీయూలో కలిపి ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి.
అయితే ఈ విషయంలో అందరికీ షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు ఓ టెక్నీషియన్.
ఖైదీ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన లోకేష్ కనగరాజ్ తరువాత తన ప్రతీ సినిమాను ఎల్‌సీయూలో భాగంగానే రూపొందిస్తున్నారు.
ఒక సినిమాకు మరో సినిమాకు ఏదో ఒక కనెక్షన్ ఉండేలా కథ రెడీ చేస్తున్నారు.
అయితే లియో విషయంలో అలాంటి కనెక్షన్స్ ఏవీ కనిపించకపోయినా.. క్లైమాక్స్‌లో..
విక్రమ్ క్యారెక్టర్ చేసే ఒక్క ఫోన్ కాల్‌తో ఈ సినిమాను కూడా ఎల్‌సీయూలో భాగం చేశారు.
అవసరం లేకపోయినా... లియోను ఎల్‌సీయూకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారన్న విమర్శలు వినిపించాయి.
కానీ లోకేష్ టీమ్ మెంబర్ మాత్రం ఎల్‌సీయూలో లియో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి