హైదరాబాద్‌లో ‘గుంటూరు కారం’ షూటింగ్..

14 September 2023

విజయ్ దళపతి కథానాయకుడుగా లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లియో’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మాస్టర్ బ్లాక్ బస్టర్ అయింది.

విక్రమ్ లాంటి విజయం తర్వాత లోకి యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఎస్ ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి సెవెన్ స్క్రీన్ స్టూడియో పథకంపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తుండగా.. ఈ చిత్రం తాజాగా యూకే సెన్సార్ పూర్తిచేసుకుందని మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా అన్‌కట్‌ వెర్షన్‌ను యూకేలో విడుదల చేయనున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించింది డిస్ట్రిబ్యూషన్ సంస్థ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

ఇదిలా ఉంటె భారత్ లో ‘నా రెడీ’ పాట సెన్సార్ కి వెళ్లగా 4 నిమిషాల 17 సెకన్లు నిడివి ఉన్న పాటలో మధ్యలో మద్యపానానికి సంబంధించిన లిరిక్స్‌ను మార్చాలని సూచించింది.

అంతేకాక సిగరెట్‌ కాలుస్తూ కనిపిస్తున్న క్లోజ్ అప్ షాట్స్ నిడివి తగ్గించి ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ ఫాంట్ ను పెంచాలని తెలిపింది సెన్సర్.

ఇదిలా ఉంటె ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఇటీవల లుక్స్, సాంగ్ అందరిని ఆకట్టుకున్నాయి.