వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా లియో.
లోకేష్ మార్క్ డార్క్ థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి వరకు రీజినల్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన విజయ్, ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్నారు. వసూళ్ల విషయంలోనూ అదే రేంజ్ టార్గెట్‌తో బరిలో దిగుతున్నారు.
పాన్ ఇండియా మార్కెట్‌లో రాజమౌళి సినిమాల తరువాత ఆ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన సౌత్ సినిమాలు రెండే ఒకటి కేజీఎఫ్, మరోటి పుష్ప.
వీటిలో కేజీఎఫ్ 2 నాన్ బాహుబలి రికార్డ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమానే టార్గెట్ చేస్తున్నారు లియో స్టార్ విజయ్.
కేజీఎఫ్ 2 1200 కోట్లకు పైగా వసూళ్లుతో సౌత్ సినిమాల్లో నేషనల్ లెవల్‌లో టాప్ లిస్ట్‌లో నిలిచింది. లియోతో ఆ రికార్డ్‌లను తిరగరాయలన్న పట్టుదలతో ఉన్నారు కోలీవుడ్ మేకర్స్.
ఇప్పటి వరకు తమిళ సినిమా నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో సందడి చేసిన మూవీ ఒక్కటి కూడా రాలేదు. లియోతో ఆ లోటు తీర్చాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.
ఆల్రెడీ ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే కేజీఎఫ్ 2 రేంజ్‌కు రావటం లియోకు పెద్ద కష్టమేం కాదన్న టాకే వినిపిస్తోంది. మరి ఆఫ్టర్ రిలీజ్ దళపతి అదే టెంపో మెయిన్‌టైన్ చేస్తారా..?