దక్షిణాదిలో మంచి టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అంజలి. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ తెలుగమ్మాయి.
తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అలరించింది.
ప్రస్తుతం సెకండ్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. గేమ్ ఛేంజర్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న అంజలి..ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమా కోసం మొదటిసారి తాను బూతులు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో రత్నమాల పాత్రలో నటించానని..ఇప్పటివరకు తాను నటించిన అన్ని పాత్రల కంటే ఈ మూవీలో తన రోల్ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది.
తాను ఒక సినిమాలో బూతులు మాట్లాడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపింది. ఇదే విషయాన్ని తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పే సమయం కూడా తమ టీంకు చెప్పినట్లు తెలిపింది.
అలాగే బయట కూడా తన వ్యక్తిత్వం అలాంటిది కాదని.. ఎక్కువగా బూతులు అసలు మాట్లాడనని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.