బంగారు బొమ్మలా బాపుబొమ్మ.. అందానికి సీక్రెట్ ఏంటి మేడమ్.. ?

Phani CH

21 Jul 2025

Credit: Instagram

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

చాలామంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ తో మెప్పిస్తే ఈ అందాల తార మాత్రం హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకుపరిచయమైంది లయ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు వారికి చేరువైంది.

ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, దేవుళ్లు, రామా చిలుకమ్మ, హనుమాన్ జంక్షన్ తదితర హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలో 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది లయ

భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో లయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే జబర్దస్త్ టీవీ షోలోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది లయ.