ఆరోజు రానే వచ్చింది.. సంతోషంలో మెగా కోడలు

TV9 Telugu

20 April 2024

గతేదాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి పెళ్లిపీటలెక్కింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైందీ అందాల తార.

అయితే ఆ మధ్యన బిగ్ బాస్ తెలుగు విజేత అభిజిత్ తో కలిసి మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది లావణ్య. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే  దీని తర్వాత లావణ్య కొత్త ప్రాజెక్టులు ఏం ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ మెగా కోడలు.

ఫొటోషూట్స్‌తో పాటు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటోంది లావణ్య.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో కలర్ ఫుల్ శారీలో ఎంతో అందంగా కనిపించిందామె.

తనకు అమ్మ చెవిదిద్దులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఇకపై అవి తనవేనని చెబుతూ లావణ్య పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అమ్మ చెవి దిద్దులను ధరించి ఫొటోలకు పోజులిచ్చింది లావణ్య. ప్రస్తుతం ఈ ఫొటోలు మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో మన ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఇది యావరేజ్ గానే నిలిచింది.