లావణ్య త్రిపాఠి నిక్ నేమ్ ఏంటో తెలుసా ?.. ఆ పేరుకు అర్థం ఏంటంటే..
TV9 Telugu
Pic credit - Instagram
అందాల రాక్షాసిగా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత మిస్ పర్ఫెక్ట్ మూవీతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
గతేడాది నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తానని, మూవీస్ చేస్తానని చెప్పుకొచ్చింది లావణ్య.
తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఈ క్రమంలోనే తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తి విషయాలను వెల్లడిస్తూ నిక్ నేమ్ బయటపెట్టింది.
చిన్నప్పటి నుంచి అందరూ తనను 'చున్ చున్' అని పిలిచేవారని.. వినడానికి చిన్ చాన్ కార్డూన్ పేరులా ఉన్న ఈ పదం.. ఒక రైమ్ లోనిదని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు ఎక్కువగా ఆ రైమ్ పాడేవారట.
ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబర్స్ లావణ్యకు ఆ పేరును పెట్టారంట. ఇక ఈ పేరు అంటే లావణ్యకు చాలా ఇష్టమంట. ఇప్పటికే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తనను అలాగే పిలుస్తుంటారట.
వరుణ్ తేజ్, లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. 2017లో మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలోనే వరుణ్ తనకు ప్రపోజ్ చేశారని.. ప్రేమ ప్రయాణంలో ఎలాంటి ప్రపోజల్స్ చేసుకోలేదట.
ఇద్దరి నుంచి ఇష్టముందని తెలిసి లవ్ జర్నీలో ముందుకు వెళ్లారట. అయితే పెళ్లి విషయంలో మాత్రం వరుణే ముందుగా ప్రపోజ్ చేశారని.. కానీ లావణ్య పెళ్లి అంత దూరం ఆలోచించలేదని తెలిపింది.
కానీ తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఒక చిన్న ఆలోచన మనసులో ఉండడంతో పెళ్లికి ఓకే చెప్పేశారట. పెళ్లి ప్రపోజల్ మాత్రం వరుణ్ తొలి ప్రేమ స్టైల్లో చెప్పారని చెప్పుకొచ్చింది లావణ్య.