TV9 Telugu

03 January 2024

 పెళ్లి తర్వాత మెగా కోడలి ఫస్ట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

గతేడాది మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి

పెళ్లి తర్వాత సినిమాలేవీ చేయని లావణ్య ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకునేందుకు సిద్ధమైంది

గతేడాది ఆమె నటించిన పులి మేక వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది

ఇప్పుడు మిస్‌ పర్‌ఫెక్ట్‌ మరో ఆసక్తికరమైన సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైందీ అందాల తార

ప్రముఖ నటుడు, బిగ్‌ బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు

త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో మిస్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రీమింగ్‌ కానుంది