పైకి పోతున్నా.. నన్ను పట్టించుకోకండి 

TV9 Telugu

04 April 2024

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. 

ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అందాల హీరోయిన్ . 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. 

ఇక ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి. మెగా ఇంటి కోడలుగా మారిపోయింది. 

ఈ ఇద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు వరుణ్, లావణ్య

ఆతర్వాత ఈ ఇద్దరూ చాలా కాలం తమ ప్రేమను రహస్యంగా దాచిపెట్టారు. ఇక ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠీ ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించింది లావణ్య. 

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది లావణ్య. 

తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.. లిఫ్ట్ లో ఫోటోలు దిగి షేర్ చేసింది. పైకి వెళ్తున్నాను.. నన్ను పట్టించుకోకండి అనిరాసుకొచ్చింది.