14 February 2024

వరుణ్ నాకు ఇలానే  ప్రపోజ్  చేశాడు..?

TV9 Telugu

అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులను పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది లావణ్య, కానీ స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది.

ఇటీవలే మెగా కోడలుగా ప్రమోషన్ అందుకుంది లావణ్య. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్ళాడి మెగా ఫ్యామిలోకి అడుగు పెట్టింది.

కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈజంట 2023, నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ స్టోరీ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా లావణ్య మాట్లాడుతూ.. తన లవ్ ఎఫైర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ మూవీ షూటింగ్ లో లవ్ లో పడ్డామని.. పువ్విచ్చి వరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడని ఆమె ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపారు