ఈగల్‌ సాంగ్ రిలీజ్.. హనుమాన్ కు మాస్ రాజా వాయిస్‌ ఓవర్‌..

30 December 2023

TV9 Telugu

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈగల్‌.

అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో T. G. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి గల్లంతే అనే పాట లిరికల్‌ వీడియో విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇది ఆకట్టుకుంటుంది.

2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈగల్‌. ఈ చిత్రంపై బారి అంచనాలు ఉన్నాయి.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్. గతంలో వీరిద్దరి కాంబోలో జాంబీ రెడ్డి బ్లాక్ బస్టర్ అయింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

ఈ సినిమాలో కోటి అనే పేరు గల ఓ కోతి పాత్రకు అయన వాయిస్‌ ఓవర్‌ అందించారని తాజాగా చిత్రబృందం వెల్లడించింది.

రవితేజ తమ సినిమాలో భాగం కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ పది రెట్లు పెరిగిందని అన్నారు హనుమాన్ మూవీ మేకర్స్.