సీక్వెల్ గా జైలర్.. డంకీ వాయిదాపై షారుక్ క్లారిటీ..
28 September 2023
ఇటీవల రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం జైలర్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
రజినీకాంత్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ జైలర్ సినిమాకు సీక్వెల్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు నెల్సన్ తెలిపారు.
అంతేకాదు జైలర్ మూవీ సీక్వెల్ కోసం ఏకంగా 55 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలిపారు నెల్సన్ దిలీప్ కుమార్.
అయితే ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్ళనుందో ప్రకటించలేదు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. చూడాలి ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.
పఠాన్, జవాన్ చిత్రాలతో ఒకే ఏడాదిలో 1000 కోట్లు భారీ వసూళ్లు సాధించారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.
ఇదిలా ఉండే ప్రస్తుతం డంకీ చిత్రం షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు కింగ్ ఖాన్. ఈ చిత్రం క్రిస్మస్ కనుక ప్రేక్షకులను అలరించనుంది.
అయితే ఈ మూవీ అనునకున్న సమయానికి రావట్లేదని వార్త కొన్నాళ్లుగా హల్చల్ చేస్తుంది. డంకీ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని మరోసారి కన్ఫర్మ్ చేసారు షారుక్ ఖాన్.
ట్విట్టర్‌లో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ.. డిసెంబర్ 22నే డంకీ వస్తుంది.. అనుమానాలు అసవరం లేదు.. ఇంకెలా ఒట్టు వేయాలో చెప్పండి అంటూ కాస్త అసహనం కూడా వ్యక్తం చేసారు.