నవ్వులు కురిపిస్తున్న రూల్స్ రంజాన్ ట్రైలర్.. ది క్రిమినల్ ట్యాగ్ లైన్ తో వచ్చేస్తున్నా ‘ద్రోహి’..
09 September 2023
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా దర్శకుడు రత్నం కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా రూల్స్ రంజన్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్.
ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ మోడ్‌లో ఉంది. ఎంటర్‌టైన్మెంట్ బేస్ చేసుకుని రూల్స్ రంజన్ సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.
రూల్స్ రంజన్ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెన్నల కిశోర్, సుబ్బరాజు, అజయ్, వైవా హర్ష, హైపర్ ఆది, అభిమన్యు సింగ్ వంటివారు ముఖ్య పాత్రల్లో నటించారు.
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ట్యాగ్ లైన్.
క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రముఖ దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదలైంది.
శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, ఆర్. రాజశేఖర్, గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. షకలక శంకర్, మహేష్ విట్టా, మెహబూబ్ ముఖ్య పాత్రధారులు.