అప్పుడే గుంటూరు కారం థియేట్రికల్‌ ట్రైలర్‌.. శ్రీలంకకు విజయ్‌..

TV9 Telugu

06 January 2024

సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానున్న సినిమాల్లో హాట్ ఫేవరెట్‌ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం.

జనవరి 12న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మూవీ మేకర్స్‌.

జనవరి 6న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేయబోతున్నట్టుగా వెల్లడించారు మేకర్స్.

మహేష్‌ బాబు మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు.

తన నెక్ట్స్ సినిమా షూటింగ్‌ను జెట్‌ స్పీడుతో ఫినిష్‌ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి.

లియో సక్సెస్‌ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేశారు విజయ్.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్స్‌ అనే డిఫరెంట్ టైటిల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫోర్త్ షెడ్యూల్‌ శ్రీలంకలో ప్రారంభమైంది.

GOAT షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం తాజాగా పాల్గొనేందుకు శ్రీలంక వెళ్లారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.