మైసూర్‌లో చెర్రీ.. రాయలసీమ యాసలో రవితేజ..

21 November 2023

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్‌ చేంజర్‌. ఈ చిత్రం షూటింగ్ గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

రామ్‌ చరణ్‌ హీరోగా, కియారా నాయికగా నటిస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోంది.

తాజాగా ఈ చిత్రం నెక్స్ట్ చిత్రీకరణ షెడ్యూల్‌ని మైసూర్‌లో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు మూవీ మేకర్స్.

ఈ నెలాఖరు నుంచి మైసూర్‌లో గేమ్‌ చేంజర్‌ మూవీ షూటింగ్‌ ఉంటుందట. వచ్చే ఏడాది విడుదల కానుంది గేమ్‌ చేంజర్‌.

డోన్ శీను, బలుపు, క్రాక్ హ్యాట్రిక్ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది.

ప్రస్తుతం RT4GM వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

వీరిద్దరి కాంబోలో ఈ సినిమాను వచ్చే నెల (డిసెంబర్‌) మొదట్లోనే ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ రాయలసీమ యాసలో మాట్లాతూ ఆకట్టుకోనున్నారని వెల్లడించారు RT4GM మూవీ టీం.