లెంతీ  నిడివితో యానిమల్.. వరస సినిమాలతో కార్తీ..

19 November 2023

సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వస్తున్న మూడో సినిమా యానిమల్. ఈ చిత్రంలో హీరో రణబీర్ కపూర్. రష్మిక హీరోయిన్.

కంటెంట్ పరంగా ఇప్పటికే చాలా చూపించారు ఈ దర్శకుడు. తాజాగా రన్ టైమ్ పరంగానూ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

ఈ సినిమాను ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

అర్జున్ రెడ్డిని కూడా సందీప్ నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నారు.. కానీ చివరికి మూడు గంటలకు కుదించారు.

జపాన్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరస సినిమాలు ప్రకటించారీయన. దాంతో పాటు వరసగా రెండు సీక్వెల్స్ ఒకేసారి చేయబోతున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 త్వరలోనే మొదలు కానుంది. మరో సీక్వెల్‌ చేయడానికి రెడీ అవుతున్నారు కార్తీ.

అదే సిహెచ్ వినోద్ తెరకెక్కించిన ఖాకీ. ఐదేళ్ళ కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దీని సీక్వెల్ ఉంటుందని వినోద్ ఖరారు చేసారు.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో  మంగళవారంపై చాలా ఎఫర్ట్స్ పెట్టామని.. కథను నమ్మి ఆదరిస్తున్నందుకే ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు మేకర్స్.