మోస్ట్ అవెయిటెడ్ హనుమాన్ ట్రైలర్‌.. చియాన్62 మొదలు..

24 December 2023

TV9 Telugu

మోస్ట్ అవెయిటెడ్ హనుమాన్ ట్రైలర్‌ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ లీడ్ రోల్‌లో నటించారు.

సూపర్ హీరో కాన్సెప్ట్ తో తరకెక్కిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సైన్స్‌ ఫిక్షన్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌ను మిక్స్‌ చేస్తూ ఈ మూవీ రూపొందించారు. ఒకేసారి పదికి పైగా భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అంజనాద్రి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రమిది. ఇందులో తేజ సజ్జకి జోడిగా అమృత అయ్యర్ కథానాయకిగా నటిస్తుంది.

తంగలాన్ సినిమా షూటింగ్ వర్క్ పూర్తి చేసిన చియాన్ విక్రమ్. ప్రస్తుతం కొత్త సినిమాకు రెడీ అవుతున్నారు.

చిన్నా మూవీ ఫేం ఎస్‌యూ కుమార్ దర్శకత్వంలో తన 62 సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో విక్రమ్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీని ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతమందిస్తున్నారు. HR పిక్చర్స్ ప్రొడక్షన్ లో రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.