త్వరలో స్పిరిట్‌ షూటింగ్.. విజయ్‌ సేతుపతి కొత్త చిత్రం..

29 November 2023

కార్తి హీరోగా నటించిన పరుత్తివీరన్‌ డైరక్టర్‌ అమీర్‌కి, నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకి మధ్య వివాదం జరుగుతోంది.

దీనికి సంబంధించి సముద్రఖని స్పందించారు. ఆ సినిమాలో తాను కూడా నటించానని, ఆమిర్‌ ఎంత కష్టపడి సినిమా చేశారో తనకు తెలుసన్నారు.

డైరక్టర్‌ని ముప్పుతిప్పలు పెట్టిన జ్ఞానవేల్‌ రాజా, ఇప్పుడిలా మాట్లాడటానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్‌. ఈ సినిమా 2024 సెప్టెంబర్‌ నుంచి పట్టాలెక్కనుంది.

ఈ సినిమాలో ఫియర్‌లెస్‌ కాప్‌గా కనిపిస్తారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటించిన సలార్‌ డిసెంబర్‌ 22న విడుదల కానుంది.

షూటింగ్ మొదలుపెట్టాక ముందే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుందీప్ రూపొందించిన యానిమల్ హిట్ అయితే మీరింత పెరుగుతాయి.

విజయ్‌ సేతుపతి హీరోగా మిస్కిన్‌ డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ట్రైన్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సినిమా ఉంటుందట.

ట్రైన్‌ అనే టైటిల్‌ పెట్టాలనుకుంటోంది యూనిట్‌. ఇకపై విలన్‌గా నటించనని, హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతానని అన్నారు విజయ్‌ సేతుపతి.