భారీ రన్ టైమ్‌తో సలార్.. మిలియన్ మార్క్ చేరుకున్న హాయ్ నాన్న..

12 December 2023

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా సలార్. ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 22న విడుదల కానుంది.

ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైమ్‌పై తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

ఈ చిత్రం ఏకంగా 2.55 గంటల 26 సెకన్లు ఉండబోతుందని తెలుస్తుంది. ఈ లెక్కన భారీ నిడివితోనే రాబోతుంది సలార్.

గతంలో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో, ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సైతం భారీ రన్ టైమ్‌తోనే వచ్చాయి.

హాయ్ నాన్న సినిమాకు ఇండియా కంటే ఓవర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. నాని పడిన కష్టం కలెక్షన్లలో కనిపిస్తుంది.

ఈ సినిమాకు మొదటి రోజు నుంచి ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు వస్తున్నాయి. తాజాగా మూడు రోజుల్లోనే మిలియన్ మార్క్ అందుకుంది హాయ్ నాన్న.

నాని కెరీర్‌లో ఇది 9వ మిలియన్ మార్క్ సినిమా. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న నాని.. హాయ్ నాన్న సినిమాను అక్కడి ఆడియన్స్‌కు చేరువయ్యేలా చేస్తున్నారు.

దీని తర్వాత సరిపోదా శనివారం అనే చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు నాని. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్.