‘సైంధవ్’ నుంచి సెకండ్ సాంగ్.. ‘లియో’ ఇంగ్లీష్ వర్షన్..

13 December 2023

వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం.

తాజాగా విజయవాడ వీవీఐటీ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ పాట ‘సరదా సరదాగా’ అంటూ మనసుని హత్తుకునేలా సాగింది. శైలేష్ కొలను దర్శకుడు.

శ్రద్ద శ్రీనాథ ఈ చిత్రంలో కథానాయక. రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, హీరో ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో చిత్రం 600 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

తాజాగా ఈ చిత్ర ఇంగ్లీష్ వర్షన్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఓటిటిలో దీన్ని తీసుకొస్తామని ముందుగానే ప్రకటించిన దర్శక నిర్మాతలు.

తాజాగా అలాగే చేసి చూపించారు. లియో చిత్ర ఇంగ్లీష్ వర్షన్ చూడాలనుకున్న వాళ్లు డిజిటల్‌లో వీక్షించవచ్చు.

లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయకిగా ఆకట్టుకుంది.