NBK 109 కీలక అప్‌డేట్.. భారీ చిత్రాల ట్రెండ్‌పై కమల్ వ్యాఖ్యలు..
27 December 2023
TV9 Telugu
NBK 109 సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు బాబీ. సినిమా వేరే లెవల్‌లో వస్తుందని చెప్పారు.
ఊటీలో ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తయ్యిందన్న బాబీ, నెక్ట్స్ షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్లాన్ చేస్తున్నామన్నారు.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా నటించే కథానాయకి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న భారీ చిత్రాల ట్రెండ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు లోక నాయకుడు కమల్ హాసన్.
స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్న భారీ సినిమాలు మాత్రమే సినిమా ఇండస్ట్రీని నిలబెట్టలేవన్నారు కమల్.
చిన్న సినిమాలు లేకుండా ప్రపంచంలో ఎంత పెద్ద సినిమా ఇండస్ట్రీ అయినా కూడా అది మనుగడ సాధించలేదన్నారు అయన.
చిన్న సినిమాల ద్వారానే ఎంతో మంది అభిమానంతో తాను స్టార్ హీరో స్థాయికి రాగలిగా అన్నారు ఉలగనాయగన్ కమల్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి