మళ్లీ బయపెట్టనున్న గీతాంజలి.. ఆ తర్వాతే రానున్న లియో 2..

30 December 2023

TV9 Telugu

అంజలి ద్విపాత్రాభినయంలో నటించిన బ్లాక్ బస్టర్ హారర్‌ కామెడీ గీతాంజలి సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది.

అంజలి 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

మొదటి భాగనికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా.. రెండో భాగంతో శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ లియో.

ప్రపంచవ్యాప్తంగా 612 కోట్ల వసూళ్ల అందుకుంది ఈ సినిమా. విజయ్ కెరీర్ లో మొదటి 500 కోట్ల క్లబ్ చిత్రమిది.

ఈ సినిమా రిలీజ్‌ సమయంలోనే సీక్వెల్‌ ఉంటుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌. తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు లోకేష్‌.

రజనీతో చేయబోయే సినిమా తరువాత కార్తితో ఖైదీ 2 ఉంటుందని ఆ తరువాత విజయ్ దళపతితో లియో 2 చేస్తానని చెప్పారు.