ఇంకాస్త ఆలస్యంగా చిరు మూవీ.. ఈగల్ పై దర్శకుడు కార్తీక్ కామెంట్స్..

03 January 2024

TV9 Telugu

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని తెలిసిందే.

అయితే చిరంజీవి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో ఇంతవరకు అడుగు పెట్టలేదు. దీనికోసం మరింత సమయం పడుతుందని తెలుస్తుంది.

గతంలో కాలికి సంబంధించిన గాయం నుంచి సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.

అందుకే షూటింగ్‌కు మరికొన్ని రోజుల తర్వాత జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది. సోషియో ఫాంటసీగా వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారు దీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.

రవితేజ ఇమేజ్‌కు సరిపోయే పూర్తి మాస్ మసాలా సినిమా ఇది అని.. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు అన్నారు.

కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పారు కార్తీక్. రవితేజ టైమింగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అన్నారాయన.