కుర్రాడిగా మారనున్న విజయ్.. విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా పోస్టు వైరల్..
13 December 2023
ఇటీవల లియోలో మిడిల్ ఏజ్డ్ తండ్రిగా కనిపించిన విజయ్, తన నెక్స్ట్ మూవీలో కుర్రాడిగా కనిపించనున్నారు.
డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమాలో పాతికేళ్లు వయసు తగ్గించుకుని నటించడానికి రెడీ అవుతున్నారు.
డీ ఏజెనింగ్ టెక్నాలజీతో ఈ సన్నివేశాలను రూపొందించనున్నారు. పది నిమిషాల సన్నివేశాల కోసం రూ.6కోట్లు ఖర్చుపెట్టనున్నారట.
మీరా బంగారం ఎందుకింత త్వరగా వెళ్లిపోయావంటూ విజయ్ ఆంటోనీ భార్య... ఫాతిమా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
చావుకు, బతుకుకు మధ్య ఉన్న గీత తనకు అర్థం కావడం లేదంటూ పోస్టు పెట్టారు ఫాతిమా. మీరా లేని లోకంలో తాను ఇంకా బతికే ఉన్నానని చెబుతూ పాత ఫొటో షేర్ చేశారు.
ఇటీవల విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసింది. కూతురిని గుర్తు చేసుకొంటూ ఈ పోస్ట్ చేశారు ఆమె.
కెప్టెన్ విజయ్ కాంత్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు విజయ్ కాంత్. దాదాపు 14 రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి