తండేల్‌ షూటింగ్ మొదలు.. గుంటూరు కారం రొమాంటిక్ అప్డేట్..

11 December 2023

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ తండేల్‌.

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ పూజ వేడుకకు సీనియర్‌ హీరోలు చై తండ్రి నాగార్జున, మావయ్య విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రేమమ్, సవ్యసాచి తర్వాత చందూ మొండేటి, నాగ చైతన్య కాంబోలో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థిల్లర్ సినిమా గుంటూరు కారం.

ఈ సినిమాలోని రొమాంటిక్‌ నెంబర్‌ ఓ మై బేబీని ఈ నెల 13న విడుదల చేయనున్నాట్లు తాజాగా తెలిపారు మూవీ మేకర్స్.

ఈ మేరకు డిసెంబర్ 11న సాంగ్‌ ప్రోమో విడుదల చేస్తారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది.

ఇదిలా ఉంటె 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. దీని తర్వాత జక్కన్నతో ఓ సినిమా చేయనున్నారు మహేష్.