సలార్ దండయాత్ర.. హనుమాన్ పై ప్రశాంత్ వర్మ కామెంట్స్..

TV9 Telugu

05 January 2024

మొదటి రోజు నుంచి ప్రభాస్ సలార్ పార్ట్ 1 సినిమాకు వస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మధ్యలో కాస్త స్లో అయినా.. మళ్లీ వీకెండ్స్ వచ్చేసరికి రెచ్చిపోతుంది సలార్. తాజాగా 11 రోజుల్లో ఏపీ తెలంగాణలోనే 145 కోట్లు షేర్ వసూలు చేసింది సలార్.

సంక్రాంతి వరకు సినిమాలు లేవు కాబట్టి మెల్లగా 150 కోట్లు కూడా వసూలు చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే 800 కోట్లకు చేరువలో ఉంది సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రం. రెండో భాగానికి శౌర్యంగ పర్వం అనే టైటిల్ పెట్టారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్. తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో సినిమా ఇది.

ప్రపంచంలో మన హనుమంతుడి కంటే గొప్ప సూపర్ హీరో ఎవరూ లేరని ఈ చిత్రంతో చూపించబోతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

సినిమా గురించి ఆయన చెప్తూ.. క్రిష్ తరహాలో సాగే సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా ఇదన్నారు ప్రశాంత్ వర్మ. జనవరి 12న విడుదల కానుంది హనుమాన్.

ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయకిగా ఆకట్టుకోనున్నారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు.