నందమూరి బాలకృష్ణ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. దసరాకు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి గణేష్ ఆంథమ్ వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. థమన్ సంగీతం అందించిన ఈ పాట బాగా పాపులర్ అయింది.
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని బ్రెష్ వేస్కో అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 8న విడుదల కానుంది.
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ హీరోగా వస్తున్న సినిమా బూట్ కట్ బాలరాజు. ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ 'రింగు రింగు బిళ్ళ' ను విడుదల చేశారు మేకర్స్.
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కిస్తున్న సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్’.
ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి’ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా 30 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది.
పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై నిహారిక నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ గ్లాస్ రూమ్‌లో జరిగాయి. నూతన నటీనటులతో ఈ మూవీ నిర్మిస్తున్నారు నిహారిక.