TV9 Telugu
11 February 2024
యంగ్ హీరోస్ కు పోటీగా ఆ నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి
కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే.
దీంతో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లకు సైతం క్రేజ్ పెరిగింది. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్‌లో నటించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ చిరంజీవి లీడ్ రోల్‌లో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సీఈఓ సారాండోస్ చిరంజీవి హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య వెబ్ సిరీస్‌కు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఉండడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి చిరు నిజంగానే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారా లేదా.? తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి