అలా చేయాల్సి వస్తే డాక్టర్ వృత్తినే కొనసాగిస్తాను.. శ్రీలీల..

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు.

ప్రస్తుతం శ్రీలీల అరడజను కు పైగా చిత్రాల్లో నటిస్తుంది.

ఓ వైపు యంగ్ హీరోలకి జోడిగా చేస్తూనే.. మరో పక్క సీనియర్ హీరోల సరసన ఆకట్టుకుంటుంది.

పెళ్లి సందడి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.

ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరితో పాటు రామ్, నితిన్, వైష్ణవ తేజ్ వంటి యంగ్ హీరోలకి జోడిగా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈమెకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా  శ్రీలీల దగ్గరకు వచ్చిన ఓ చిత్రానికి నిర్మొహమాటంగా నో చెప్పిందని సమాచారం.

అయితే అది బోల్డ్ కంటెంట్ కావడంతో శ్రీలీల వెంటనే నో చెప్పేసిందని తెలుస్తోంది.

ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన  హద్దులు దాటి నటించనని చెప్పిందట.

ఒక వేళ అలా చేయాల్సి వస్తే సినిమాలనుంచి తప్పుకొని తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తానని తెలిపిందని సమాచారం.