రకుల్ ప్రీత్ పెళ్లి కబురు.. హనుమాన్‌ సినిమాటిక్ యూనివర్స్..

03 January 2024

TV9 Telugu

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు కారం సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.

ఈ సినిమాలో మహేష్ తండ్రి, సూపర్ స్టార్ దివంగత కృష్ణకు సంబంధించిన ఒక డైలాగ్‌తో పాటు పాట కూడా ఉంటుందని తెలుస్తుంది.

జనవరి 6న గుంటూరు కారం సినిమా ట్రైలర్ విడుదల కానుంది. అందులో దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తారేమో చూడాలి.

ఫలితంతో సంబంధం లేకుండా వారస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

జనవరి 3న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు.

ఇందులో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు టైసన్ నాయుడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.

అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ మున్నా దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.