న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న వాల్తేరు వీరయ్య.. ఫ్యాన్స్ కుటుంబాలను ఓదార్చిన యష్..
TV9 Telugu
12 January 2024
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఈ సినిమాతో ఈ జనరేషన్‌కు అస్సలు పరిచయం లేని ఓ రేర్ రికార్డ్‌ను రిపీట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
గత ఏడాది సంక్రాంతి కనుక వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయి ఇప్పటికి సరిగ్గా 365 రోజులు పూర్తయ్యింది.
అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లలో 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా కటౌట్‌లు ఏర్పాటు చేస్తూ కరెంట్ షాక్‌తో మృతి చెందిన అభిమానుల కుటుంబాలను ఓదార్చారు హీరో యష్.
ప్రతీ సారి తన పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుండటంతో పుట్టిన రోజు వస్తుందంటునే తనకు భయం వేస్తుందన్నారు యష్.
దేశంలో కోవిడ్ 19 కేసులు మళ్లీ ఎక్కువ అవుతుండటంతో ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు రాకింగ్ స్టార్ యాష్.
కేజిఎఫ్ చాప్టర్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకీ భాయ్ ఇటీవల టాక్సిక్ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి