ఎయిర్ పోర్టులో మెగా ఫ్యామిలీ.. తంగలాన్ మరోసారి వాయిదా..!

TV9 Telugu

20 January 2024

ఇటీవల సంక్రాంతి పండగ సంబరాల కోసం మెగా కుటుంబం అంతా కలిసి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకి వెళ్ళారు.

ఒక్క పవన్ కళ్యాణ్ కుటుంబం తప్ప మిగతా మెగా ఫ్యామిలీ అంతా అక్కడే సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

తాజాగా సంక్రాంతి పండగ అయిపోవడంతో కుటుంబ సమేతంగా బెంగుళూరు నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు మెగా హీరోలు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చిరంజీవి, రామ్ చరణ్ సహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా కనబడటంతో కోలాహలంగా మారింది.

విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న తంగలాన్ అనే కోలీవుడ్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి.

ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న విడుదల చేస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు.

అయితే ఇప్పుడు ఆ తేదీని మార్చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లు.

ఎప్రిల్‌లో తంగలాన్ విడుదల కానుంది. ఎప్రిల్ అని చెప్పినా.. రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దర్శక నిర్మాతలు.