'మెరీ క్రిస్మస్‌' కొత్త పాట.. 'ఈగిల్‌'పై మాస్ రాజా కామెంట్..

29 December 2023

TV9 Telugu

కోలీవుడ్ స్టార్ విజయ్‌ సేతుపతి, హీరోయిన్ కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా మెరీ క్రిస్మస్‌.

రొమాంటిక్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి పండగ కానుకగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ ట్రాక్‌ను విడుదల చేసింది ఈ చిత్రబృందం. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన మొదటి బాలీవుడ్ చిత్రమిది. దీనికి ముందు ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఆకట్టుకున్నారు.

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈగిల్‌. కార్తీక్ గట్టమనేని ఈ సినిమా దర్శకుడు.

తనకు కెరీర్‌లో సంతృప్తినిచ్చిన సినిమా అని అన్నారు రవితేజ. ఈగిల్‌ పక్కా కమర్షియల్‌ సినిమా అని అన్నారు.

పండక్కి అభిమానులకు కావాల్సిన అన్నీ అంశాలు ఇందులో ఉంటాయని అన్నారు. జనవరి 13న విడుదల కానుంది ఈగిల్‌.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్‌ హీరోయిన్లు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు.