ఖన్సార్ ఎరుపెక్కల అంటున్న డార్లింగ్.. గుంటూరు కారం క్రేజీ అప్‌డేట్..

19 December 2023

TV9 Telugu

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు. అనివార్య కారణాలతో కాస్త ఆలస్యమైనా కూడా ట్రైలర్ చూసాక ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్‌గానే ఈ సినిమాను రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 22న విడుదల కానుంది సలార్.

ఈ చిత్రంపై బారి అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా 1000 కోట్లు వసూళ్లు చేస్తునందని మేకర్స్, డార్లింగ్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు ఆ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

సినిమాలో మొత్తం నాలుగు పాటలతో పాటు ఓ బిట్ సాంగ్ ఉంటుందని.. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తైపోయిందని చెప్పారు వంశీ.

షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 21 నుంచి ఆ మిగిలిన ఒక్క పాట షూటింగ్ కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు నాగవంశీ.

బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పు.. క్లిక్స్ కోసం తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు నాగవంశీ.