ప్రభాస్ అరుదైన రికార్డు.. సునీల్ శెట్టితో బాలయ్య..

02 January 2024

TV9 Telugu

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు వస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

10 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సలార్. ఇదిలా ఉంటే మరో అరుదైన రికార్డు కూడా అందుకున్నారు ఈయన.

తన కెరీర్‌లో మూడుసార్లు 600 కోట్ల సినిమాలు ఇచ్చిన ఇండియన్ హీరోగా చరిత్ర సృష్టించారు రెబెల్ స్టార్ ప్రభాస్.

గతంలో బాహుబలి 1 ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్.. ఇప్పుడు సలార్‌తో ఈ రికార్డు అందుకున్నారు రెబల్ స్టార్.

ఓ వైపు రాజకీయాలతో పాటు మరోవైపు ఒప్పుకున్న సినిమాలకు కూడా న్యాయం చేస్తున్నారు నందమూరి నటసింహ బాలకృష్ణ.

ఈయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

2023 దసరా విన్నర్ గా నిలిచిన బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించారు.