తాత మాట నిజమైందన్నా చైతూ.. నెట్టింట్లో చర్చకి ఫుల్ స్టాప్ పెట్టిన రవీనా..
13 December 2023
తన కెరీర్ విషయంలో తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాట నిజమైందని అంటున్నారు హీరో నాగచైతన్య.
చిన్నప్పుడు ఎవరైనా అడిగితే ఇంజనీర్ అవుతానని చెప్పేవారట నాగచైతన్య. అయితే చైతూ తప్పకుండా హీరో అవుతారని ఏఎన్ఆర్ అనేవారట.
ఇప్పుడు తాతయ్య మాటలు గుర్తుకొస్తున్నాయని అంటున్నారు చైతూ. ఈ విధంగా తన తాతయ్య ఏఎన్ఆర్ ను తలచుకున్నారు.
తాజాగా దూత వెబ్ సిరీస్ డిజిటల్ లో అడుగుపెట్టిన నాగ చైతన్య. ఈ వెబ్ సిరీస్ భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ది ఆర్చీస్ సినిమా బాలేదంటూ సోషల్ మీడియాలో ఉన్న పోస్టుకు రవీనా టాండన్ లైక్ కొట్టారనే చర్చ జరుగుతోంది నెట్టింట్లో.
సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉంటుందని వివరణ ఇచ్చారు నటి రవీనా.
తాను సినిమా చూశానని, తనకు నచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో ఈ చర్చకి ఫుల్ స్టాప్ పడింది.
కేజీఎఫ్ చాప్టర్ 3లో తన నటినతో ఆకట్టుకున్నారు ఈమె. ఈ సినిమాతో నేషనల్ స్థాయిలో మంచి క్రేజ్ అందుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి