ఓటీటీలో పొలిమేర 2.. హాయ్ నాన్నకి మంచి రెస్పాన్స్..

08 December 2023

సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది.

చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఈ సినిమాకు డిజిటల్ ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.

ఈ మధ్యే దీనికి సీక్వెల్ ‘మా ఊరి పొలిమేర-2’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అయింది.

తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’ ఆహాలో విడుదలైంది. ఓటిటిలోనూ ఇది అదరగొడుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.

హాయ్ నాన్న సినిమాకు నాని పడిన కష్టం కలెక్షన్లలో కనిపిస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఓవర్సీస్ నుంచి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

ముఖ్యంగా ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు అక్కడ్నుంచి ఇప్పటికే 2 లక్షల డాలర్లు వచ్చాయి.

ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. కొత్త దర్శకుడు శౌర్యు ఈ సినిమాని తెరకెక్కించారు.

తండ్రి కూతుళ్ల మధ్య ఎమోషనల్ డ్రామా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తొలి చిత్రంతో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు.