క్రిమినల్స్ మధ్యే డంకీ షూటింగ్‌.. మెరీ క్రిస్మస్‌ ప్రమోషన్‌ షురూ..

24 December 2023

TV9 Telugu

రిలీజ్‌ కి ముందు ప్రమోషన్స్ లోడంకీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు అభిమానులతో పంచుకున్నారు మేకర్స్‌.

అప్పుడే ఈ సినిమాలో కీలకమై జైలు ఎపిసోడ్ షూటింగ్‌కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నారు మూవీ మేకర్స్.

ప్రమాదకరమైన క్రిమినల్స్ ఉన్న రియల్‌ జైలులో షూటింగ్ చేయాల్సి రావటంతో భయపడ్డామన్నారు హీరో షారూఖ్, తాప్సీ.

వర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేస్తున్న తాజా మూవీ మెరీ క్రిస్మస్‌.

ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌.

డిసెంబర్ 20న ట్రైలర్‌ రిలీజ్‌తో ప్రమోషన్స్‌ ప్రారంభించారు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు.

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ సుహానా ఖాన్‌, అగస్త్య నంద, ఖుషీ కపూర్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ది ఆర్చీస్‌.

ఈ షోకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా లీడ్ యాక్టర్స్‌ హిందీలో చెప్పిన డైలాగ్స్ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి.